Saturday, April 16, 2011

ప్రియమైన పాఠకులకు నమస్కారములు,
      
              నేటి ఆధునికయుగంలో మీడియా గ్రామగ్రామాన విస్తరించివున్నది.కాని ఆవ్యవస్త కొన్ని కారణాలవలన సరైన దిశలో పయణించుటలేదు.ఎందుకనగా గత కొన్నెళ్ళగా ప్రింట్ మీడియా (లేదా) ఎలక్ట్రానిక్ మీడియా ను పరిశీలించితే ఎవరికైన అర్ధం అవుతుంది.సమాజాన్ని బాగుచెయ్యకపొయిన పరవాలేదు కాని వక్రమార్గంలో ఆలోచింపచేస్తుంది. అంతేగాకుండా సరైన న్యూస్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం రాజకీయవార్తలతో కాలం గడుపుతున్నారంటే అతిశయోక్తికాదు. దేశభవిష్యత్తు రాజకీయనాయకులు,క్రికెట్ వీరులు,సినిమా వీరులు,పారిశ్రామికవేత్తల మీద ఆధారపడినట్టు   ఆ వ్యక్తులే మన భారతరత్నాలుగా చిత్రీకరిస్తున్నారు.ముఖ్యంగా నేటి యువత కెరీర్ పేరుతో చదువు,ఉద్యోగం,తన కుటుంబం అంటూ కాలం
వెళ్ళ దీస్తున్నారు.120 కోట్ల జనాభా ఉన్న దేశ ప్రగతికి నేటియువత ఏ విధంగా సహాయపడతారో తెలియజేస్తూ 'రేపటితరం' తో నవసమాజాన్ని నిర్మించాలని ఈ ప్రయత్నం .
            ముఖ్యంగా అవినీతి నశించాలి,సత్యమునేపలకాలి,రౌడీయుజం నశించాలి అనే మాటల్చెప్పటలేదు.మన దేశం ఏ రంగాలలో అభివ్రుద్దిచెందింది , ఏ రంగాలలో ఏ విధంగా వెనుకబడినది చెబుతూ మనీ ఇంపార్టెన్స్ లేకుండా ఉన్నతవిలువలతో ఎలా సహాయపడాలో తెలియజేయటమే నా ఈ ప్రయత్నం.
       చివరగా ఓకమాట. మీకు కూడా కొన్ని ఆలోచనలు,సూచనలు మీ మనస్సులో ఉంటాయి.వాటిని కూడా ఈ పత్రికద్వారా మన అందరితో షేర్ చేసుకొని "రేపటితరం" లో "భారత్" గొప్పశక్తి కావాలని ఆకాంక్షిస్తూ మీ .....             
      

భారత దేశంలో నంబర్ 1

భారత దేశంలో నంబర్ 1