Tuesday, December 25, 2012

మూఢ నమ్మకాలపై ఎందుకుంత నమ్మకం..


           స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేవలం 40% వున్న అక్షరాస్యత ఇప్పుడు 70% పెరిగిన కూడ ఎక్కువమంది మూఢ నమ్మకాలను ఆశ్రయిస్తున్నారు.గడిచిన 60 ఏళ్ళలలో టెక్నాలజి అభివ్రుద్ది చెందిన కూడ,జనవిజ్ఞాన వేదిక ,మీడియా గగ్గోలు పెడుతున్న ప్రజలు బాబాలు దగ్గరకు ,మంత్ర వైద్యుల దగ్గరకు వెళ్ళటం మానట లెదు.ప్రజల అమాయకత్వమా ,మూర్కత్వమా,అతిభక్తి అనుకోవాల జనవిజ్ఞాన వేదిక మేధావులను కలవర పెడుతున్న ప్రశ్న. కాని ప్రజలు అమాయకులు గారు ,మూర్కులు అంతకంటె కారు.

                       స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్ళు అయినా,ప్రపంచంలో విషయం జరిగిన 2 సెకన్లలో మీకు సమాచారము అందిచె టెక్నాలజి అభివ్రుద్ది చెందినా చిన్నపాటి జ్వరానికి అందిచె వైద్యం పేదవాడికి అందుబాటులో లేదు.            
చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు జరిగే చిన్న దెబ్బలకు,మామూలుగా వచ్చె తలనొప్పి,జ్వరాలకు డాక్టర్ దగ్గరుకు వెళీతే వచ్చే బిల్లు చూసి మూర్చపోవలసి వస్తుంది.గొప్ప గొప్ప చదువులు చదివి  పరిశోధనలు చేసి తయారవుతున్న మందులను నమ్మండి అంటున్న మేధవులు ఒక రోగానికి వంద మంది డాక్టర్లు వంద రకాల మందులు ఎందుకు ఇస్తున్నారో ఆలోచించుటలేదు. గడిచిన 60 ఏళ్ళలో మండలస్తాయి లేదా కనీసం నియోజక స్తాయిలో అయినా వైద్యం ఎందుకు అందుబాటులో లేదు అని ప్రభుత్వాన్ని నిలదీసిన పాపానపోలేదు.కోటి రూపాయలతో మంచి టెక్నాలజితో వైద్యశాలను ఏర్పరచవచ్చు.1100 మండలాలకు కేవలం 1100 కోట్లతో (మన బడ్జెట్ లక్ష కోట్లు)ఎందుకు ప్రభుత్వ వైద్యశాలలను నిర్మించుటలేదు అని ధర్నాలు చేయుటలేదు. రోగానికైన సగం మందు నమ్మకం , నమ్మకాన్ని డాక్టర్లు కలిగించనప్పుడు యితరులను ఆశ్రయిస్తారు.వారు సహజంగానే సొమ్ముచేసుకుంటారు.ఉదాహరణకు పాము మత్రం తీసుకుంటె  కరిచినదానికంటే భయంతో ప్రాణాలు పోతాయి.అప్పుడు మంత్రాన్ని ఉపయోగించటవలన తాత్కాలిక ధైర్యాన్ని కలిగించుటతో పాటు 20% వున్న ఛాన్స్ 50% వరకు పెంచవచ్చు.దానివలన 30 కిలో మీటర్ల దూరంలో డాక్టర్ దగ్గరకు వెళ్ళేసరికి బతకాడినికి అవకాశాలు ఎక్కువ2 వ ఉదాహరణ బత్తిన సోదరులను (చేప మందు) తీసుకుంటే అక్కడుకు వచ్చే వాళ్ళలలో ఎక్కువ మంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళి వచ్చినవారే కాని పరిష్కారం దొరకక వీళ్ళను ఆశ్రయిస్తున్నారు.హాని జరుగటలేదు కదా.
 వీళ్ళ దగ్గరుకు వెళ్ళెద్దు అని చెప్పటం కన్నా ఈ ఇంగ్లీష్  మందు వాడటం వలన నయమౌతుంది.అని ప్రూఫ్ చూపించటం వలన మీ ప్రయత్నం సాధ్యం అవుతుంది.
3 వ ఉదాహరణ బాబాలను తీసుకుంటే అనవసరుపు కోరికలతో ,అర్ధంలేని ఆలోచనలు,ఆరాటాలతో ప్రజలు మానసికంగా అలిసిపోతున్నరు.ఏ ఉద్యోగం చేస్తున్నవారైనా (గవర్నమెంట్ లేదా ప్రైవేటు)  బిజినెస్ చేస్తున్నవారైన చేస్తున్నదాని మీద సంత్రుప్తి చెందటలేదు.  ఫలితంగా భొతిక,మానసిక రోగాలను కోరితెచ్చుకుంటున్నారు.దానికోసం బాబాలను ఆశ్రయిస్తున్నారు.సహజంగానే వారు సొమ్ము చేసుకుంటున్నారు.బాబాలను తిట్టటం కంటే ప్రజలను ఆలోచనలను మార్చగల్గితే మీ ప్రయత్నం సాద్యం అవుతుంది.అంతేకాని టీ.వి లలో కూర్హొని ప్రజలను మూఢనమ్మకాలను నమ్మొద్దు అని ఎంత అరిచిన ఉపయోగం వుండదు.మేధావులు మీ ప్రధమ కర్తవ్యం వైద్యం పేదవాడికి అందుబాటులో వుండేటట్టు చేయడం.బత్తిన సోదరుల ఇంటిముందు కూర్చోవడం కంటే సి.ఎం ఇంటిముందు కూర్చుంటే ఫలితం వుంటుంది.ఆలోచించండి.........

No comments:

Post a Comment