Sunday, December 30, 2012

తెలంగాణావాదం -సమైక్యవాదం


                          జై తెలంగాణా,జై తెలంగాణా
                          మా తెలంగాణా మాకు కావాలి...అంటూ నినదిస్తూంటే

                       కొన్ని పార్టీలకు విక్రుతానందం (తె.రా.స)
                       కొన్ని పార్టీలకు భయం (టి.డి.పి,వై.కా.ప లకు)
                       కొన్ని పార్టీలకు రాజకీయం (బి.జె.పి)
                       కొన్ని పార్టీలకు కామెడి (కాంగ్రెస్)
                       కొందరికి అయోమయం (ప్రజలకు)
ఎవరు అవునన్నా,కాదన్నా ఇది ముమ్మాటికి నిజం.ఇస్టం వున్నా లేకపొయినా ,ఏకీభవించినా లేకపొయినా ఇరు ప్రాంతాల ప్రజలు తెలుసుకో వలిసిన విషయాలు వున్నాయి.మొదటిది పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాస్ట్రానికి ప్రాణాలు అర్పించినారు కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి కాదు.ఆంధ్రప్రదేశ్ కు పొట్టి శ్రీరాములకు సంభంధం లేదు.2 వది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాస్ట్రం కాదు, రెండు రాస్ట్రాల కలయిక అని గ్రహించాలి. 3 వది ఏ విషయంలో అయిన ప్రజాభిప్రాయం 100% ఏకీభవించరు సహజంగానే కొందరు వ్యతిరేకిస్తారు.అంతమాత్రాన విశాలాంధ్ర ఏర్పడేటప్పుడు తెలంగాణా నాయకులు,ప్రజలు మద్దతు లేదనడం మూర్ఖత్వం అవుతుంది.4 వది తెలంగాణాను భేషరుతుగా కలపలేదు అని,హైదరాబాద్ ను విశాలాంధ్ర రాజధానిగా చేస్తాం అంటేనే రెండు రాస్ట్రాల కలయిక ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అని గ్రహిచాలి.ఒక వేళ కర్నూల్ రాజధానిగా వుంటే హైదరాబాద్ అంతకాకపోయినా భారతదేశపు ముఖ్యపట్టణాలలో కర్నూల్ ఒకటిగా వుండే దని గ్రహిచాలి.5 వది హైదరాబాద్ రాజధాని అవ్వడం వలన మాత్రమే అన్ని జిల్లాల ప్రజలు రాజధానికి వలస వచ్చారు అని గ్రహించాలి.లేకపోతే కర్నూల్ కు కొద్దిపాటి పెట్టుబడులు,వలసలు వచ్చేవి అని అన్ని ప్రాంతాల మేధావులు గ్రహించాలి.6 వది హైదరాబాద్ రాస్ట్రం అనేది మూడు భాగాలు,ఒక భాగం మహారాస్ట్రలో ,రెండవ భాగం కర్నాటకలో ,మూడొవభాగం ఆంధ్రరాస్ట్రంలో కలిపి ఆంధ్రప్రదేశ్ గ ఏర్పడింది అని గ్రహించాలి.7 వది మూడొవభాగం (తెలంగాణా) వారు మాత్రమే కలిపిన భాగానికి ప్రత్యేక రాస్ట్రం కోరుతున్నారు అని గ్రహిచాలి.ఇక చివరది,8 వది ఆంధ్రప్రదేశ్ ఏర్పడినతరువాత దేశంలో ని మిగతా రాస్ట్రాలు కూడా భాషాప్రయుక్త రాస్ట్రాలుగా విడిపోయినాయి అని గ్రహించాలి.ఇది ఏ.పి చరిత్ర.
                          1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని ఇరు ప్రాంతాలలోని మెజారిటి ప్రజలు కలిసిపోయినా కొంతమంది కలవలేకపోయినారు దానికి కారణం ఆంధ్రరాస్ట్రంతో పోలిస్తే తెలంగాణాలో నిరక్షరాస్యత ఎక్కువుగా వుండడం ,భాషాపరంగా తేడా వుండడం,విద్య-వైద్య సదుపాయాలు తక్కువుగా వుండడంవ్యవసాయానికి కావలిసిన నీటి వనరులు తక్కువుగా వుండడం వలన (ఆంధ్ర రాస్ట్రం తో పోలిస్తే) సహజంగానే కొంతమందికి అసంత్రుప్తి కలిగించింది.రాజకీయనాయకులు తమ రాజకీయప్రయోజనానాలకు ఆ కొద్దిమందితో చెయ్యి కలిపి సొమ్ము చేసుకున్నారు.   ఏ.పి ఏర్పడిన తొలినాళ్ళలలో రాజకీయనాయకులు (ఇరు ప్రాంతాల నాయకులు) ప్రజల సంక్షేమము ,వెనుకబడిన ప్రాంతాల అభివ్రుద్ది గురించి ఏ మాత్రం పట్టించుకుపోగా రాజ్జ్యాధికారం కోసం నాయకుల మధ్య కోట్లాట జరిగింది ఫలితంగా చెన్నారెడ్డి నాయకత్వంలో 1969 ఉద్యమము,ఆతరువాత జరిగిన సంఘటనలు మనకు తెలిసిందే.ఆ ఉద్యమకాలంలో తెలంగాణాలో అధిక ప్రభుత్వ ఖాలీలుండటం వలన లోకల్,నాన్ లోకల్ విధానాలు పాటించకపోవడం వలన తెలగాణాలో పోటీ అభ్యర్దులు తక్కువుగా వుండటం చేత(రాస్ట్రం ఏర్పడకముందు తెలుగు మీడియంలో ప్రభుత్వ పాఠశాలలు తక్కువుగా వున్నాయి) చాలా మంది తెలంగాణాలోని ప్రభుత్వశాఖలలో చేరినారు.సహజంగానే తెలంగాణాప్రజలకు కోపం తెచ్చే సంఘటన.అందుకే అ ఉద్యమము బలపడింది. అయితే ఆసందర్భంలో ఆంధ్రప్రాంత ప్రజలకు హైదరాబాద్ మీద కాని,తెలంగాణా ప్రజలమీద కాని అంత అనుబంధం లేదు.కనుక ప్రత్యేక ఆంధ్ర ఉద్యమము ఏర్పడింది.ఏది,ఏమైనా రాజకీయస్వార్ధంతో వచ్చిన ఉద్యమాలు కనుక రాజకీయంతోనే ఉద్యమాలు చల్లబడ్డాయి.కాని అందులో పాల్గొన్న చాలా మంది సామాన్యప్రజలు ఆర్దికంగా బాగా నస్టపోయినారు అనుటలో సందేహంలేదు.ఇది మొదటిదశ.
     
          1985 వ సంవత్సరాలలో ఎన్.టి.ర్ రూపంలో మరొక విప్లవం వచ్చింది.తెలుగు వారి ఆత్మగౌరం పేరుతో వచ్చిన ఈ ప్రభంజనం ఒక కులానికి రాజ్యాధికారంతో పాటు బడుగు,బలహీనవర్గాలకు రాజకీయచైతన్యం ఇరు ప్రాంతాల ప్రజలకు కలిగించింది.ముఖ్యంగా తెలంగాణా ప్రాంతాలలో బి.సి,ఎస్.సి,ఎస్.టి లకు రాజకియాలలో అవకాశాలు కల్పించింది.ఆయా సంవత్సరాలలో కులవైష్యమాలు ఎక్కువ అయినాయి అనుటలో సందేహంలేదు కాని సంక్షేమ పధకాలు,మండలాలుగా విభజించటం,ప్రభుత్వ పధకాలపై పరిపాలనపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించుటలో ఈదశ ప్రముఖ పాత్ర వహించింది అనుటలో సందేహంలేదు.ఇది రెండవదశ.
1990 వ ఆర్దిక సంస్కరణలు దేశవ్యాప్తంగా అమలు అవుతున్న సందర్భంలో చంద్రబాబు,రాజశేఖరరెడ్డిలు ఆవకాశాలను చక్కగా వుపయొగించుకున్నారు.ప్రాంతాల భేదాలు లేకుండా తమ వర్గానికి చెందిన నాయకులకు పెట్టుబడులరూపంలో రాస్ట్రానికి చెందిన భూములను తక్కువధరలకు అప్పగించినారు.సంక్షమ పధకాల పేరుతో ప్రతి ప్రాంత ఎం.ల్.ఎ లకు అడిగింది అడిగినట్టుగా ఇద్దరు నేతలు నియొజకవర్గ నిధుల పేరుతో బాగానే ఖర్చు చేశారు.సాఫ్ట్ వేర్ లాంటి రంగాలు అభివ్రుద్దిచెంది ఉద్యొగవకాశాలు కల్పించినా,వ్యవసాయ రంగాలు వెనుకబడి నిరుద్యొగితను పెంచాయి.కొంతమందికి రాజకీయ నిరుద్యొగం వచ్చింది.దేశంలో ప్రైవేటురంగం బలపడి ప్రభుత్వరంగాల పాత్ర తగ్గి ,వ్యవసాయరంగం కూడ క్షీణించిది.అన్ని వర్గాలవారు నిరాశ నిస్ప్రుహ లతో వున్నారుహైదరాబాద్ లో భారీగా పెట్టుబడులు పెట్టటంవలన ప్రైవేటు ఉద్యొగవకాశాలు హైదరాబాద్ లో కల్గినాయి.ఫలితంగా వలసలు పెరిగినాయి.రాజధానిపై మమకారం పెరిగింది.గడచిన 20 ఏళ్ళలలో ఎన్నడూ లేనంత రాజధాని ముఖచిత్రం మారిపోయింది.
హైదరాబాద్ అనే సంపదపై ఆధిపత్యపోరు ప్రారంభమైంది
.సరిగ్గా ఇదే సమయంలో కె.సి.ర్ తన రాజకీయప్రాబల్యం కోసం మరొకసారి తెలంగాణా ఉద్యమాన్ని తట్టిలేపారు.బాబు ,రెడ్డి కె.సి.ర్ లు తమ రాజకియల స్వార్ధం కోసం ఒకరికి,ఒకరు సహకరించుకున్నారు.అప్పుడుకూడ ప్రజలు సహనాన్ని కోల్పొలేదుయధావిధి రాజకీయాలలో భాగంగా కె.సి.ర్ ఒక రోజు తలపెట్టిన నిరాహారదీక్షకు హఠాత్తుగా ఉస్మానియా విద్యార్దులనుండి ఊహించని
.పరిణామం ఎదురైంది.20 రోజుల నిరాహారదీక్ష తప్పనిసరైంది.ఇదే సమయంలో విజ్ఞతతో వ్యవహరించవలసిన పార్టీలు ముందు వెనుక ఆలొచించకుండా అందరూ తెలంగాణాకు అనుకూలము అన్నాయి.చావు బతుకుల మధ్య వున్న వ్యక్తిని చూసి ఎవరైనా అలానే చేస్తారు.ఫలితం డిసెంబర్ 9,తరువాత 23 ప్రకటనలు చక,చకా జరిగిపోయినాయి.ఇరు ప్రాంత ప్రజలకు ఇక్కడ ఒక విషయం వివరించాలి.ప్రశంత వాతావరణంలో ,ఒక చర్చ ద్వార రెండుగా విడిపోయినట్టుయితే సంతోషంగా 2 రాస్ట్రాలు ఎప్పుడో అయ్యేవి.కాని ఆంధ్ర వాళ్ళు మా ప్రాంతాన్ని దోచుకున్నారు,మా నీళ్ళు దోచుకున్నారు,మా ఉద్యొగాలు దొచుకున్నారు అని తిట్టిన తిట్టు తిట్టెసరికి ఆప్రాంతంవారికి సహజంగానే కోపంవస్తుంది.అన్ని ఉద్యొగాలు ఆంధ్రావాళ్ళు తీసుకుంటే కేవలం 2000-3000 రూపాయల కోసం హైదరాబాద్ కు ఎందుకు వస్తారో అర్త్ధం కావటలేదు.అన్ని నీళ్ళు ఆంధ్రావారు తీసుకొని పంటలు పండిస్తుంటే ఉద్యొగాలు కోసం ఎందుకు ఆరాటపడతారో అర్ధం కావటలేదు.విచిత్రము ఏమిటంటే 4 గురు తెలంగాణానుంచి,రాయలసీమ లోని ప్రతి జిల్లానుంచి ఒకరు ముఖ్యమంత్రి గా పనిచేస్తే ఒక్కరు కూడా కాని గోదావరి జిల్లా వాళ్ళు నీళ్ళు దోచుకున్నారు అంటే రాజకీయనాకులును ఏమనుకోవాలి.ఆఖరుకు ఆంధ్ర వాళ్ళు తినే ఆహారాన్ని కూడా హేళనచేస్తె అతని సంస్కారం ఏమిటో తెలిసింది.ఇలా తిట్టి అన్నదమ్ములుగా విడిపోవాలంటే ఎవరికి కోపం రాదు.తెలంగాణా మేధావులు అని చెప్పుకొంటున్న హరిగోపాల్ గారికి ఎందుకు అర్ధం కావటలేదు.సంస్కరణల నేపద్యంలో ప్రభుత్వ ఖాళీలను భర్తీ చెయ్యకుండా ,నీళ్ళు లేఖ కరువుతాండవిస్తున్నతరుణంలో నిరుద్యొగులతో ,రైతుల ఆకలి కేకలతో అలమటింస్తుటే ,దానికి ఒక ప్రాంతం వారు కారణమని ఒకరికిఒకరు ద్వెషభావాలు పెంచుకొంటున్నప్పుడు సర్దిచెప్పి,కారణాలు వివరించవలిసిన అన్ని ప్రాంతాల మేధావులు రాజకియాలు చెయ్యడం విడ్డూరంగా వుంది.
ఇక వీరి దగ్గరుకు వస్తె మేం కలిసిన భాగాన్ని మాకు ఇవ్వండి అంటే దానికి భాషకు లింకు ఎందుకుపెడుతున్నారో అర్ధం కావటలేదు.కలిసిన భాగనికి, పొట్టిశ్రీరాములుకు మద్యసంబంధమేమిటో ఆ ప్రాంత మేధావులు తెలపాలి.మేం ఎక్కడ దోచుకున్నాం అని అడగాల్సిన మీరు తెలుగువాళ్ళందరం ఒకటిగా వుండాలి అనుటలో అర్ధం లేదు అని చెప్పొచ్చు.5 కోట్ల జనాభాకు ఒక రాస్ట్రం ఏర్పడినప్పుడు 9 కోట్ల జనాభాను రెండుగా విడగొడితె నస్టం ఏమిటో బొధపడటలేదు.ఏది,ఏమైనా ఒక భావం ప్రజలలో ఏర్పడినప్పుడు విడిపోవటంలో తప్పులేదు అని నాకు అనిపిస్తుంది.ఊహలలో వున్నవారికి దాని పరిణామాలు ఇలావుండటానికి అవకాశాలు చాలాఎక్కువుగా వున్నాయి.

తెలంగాణా ఏర్పడినతర్వాత తెలంగాణా లో.....

  1) స్వయం పరిపాలన వుంటుంది.
  2)సంస్క్రుతిని కాపాడుకొంటారు.
  3)భాషా పరిరక్షణ వుంటుంది.
  4) తెలంగాణాకు చెందిన పారిశ్రామికవేత్తలు ఉద్భవిస్తారు.
  5) వున్న కొద్ది ఉద్యొగాలు తెలంగాణా వారికే వస్తాయి.
  6) రెడ్డి,వెలమ ,ముస్లిం ప్రాబల్యం పెరుగుతుంది.
ఆంధ్ర రాస్ట్రం లో.....

  1) ఇప్పటిలాగానే పరిపాలన వుంటుంది.
  2) అన్నికార్యాలయాలు సమకూరాలి కనుక తక్షణము ఉద్యొగ అవకాశాలు కల్గుతాయి.
  3) భాషా,సంస్క్రుతి పరిరక్షణ పై అంత శ్రద్దవుండదు.
  4) బి.సి,ఎస్.సి,ఎస్.టి ల వాయస్ చాల తక్కువుగా వుంటుంది. చరిత్రను చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది.
  5) పెట్టుబడులు వస్తాయి కనుక భూముల ధరలు పెరుగుతాయి.
  6) కమ్మ,రెడ్డి,రాజు,కాపుల ప్రాబల్యం బాగా పెరుగుతుంది.

తీరని సమస్యలు......

  1)నిరుద్యొగ సమస్యతీరదు.ఎందుకంటే ప్రపంచమే ప్రవేటీకరణ అవుతుంది.
  2) నీటి సమస్య తీరదు.రెండు ప్రాంతాల మద్య ఉద్రిక్తలు తరుచూ జరుగుతాయి.ఎందుకంటే ఎన్నికలలో గెలవడానికి ఇరు ప్రాంతాల నాయకులు ఉపన్యాసాలలో నీటి గురించి మాట్లాడి ఉద్రిక్తలను పెంచుతారు.
  3) కేంధ్రం నుండి వనరులు ఆశించిన స్తాయిలో రాకపోవచ్చు.ఎందుకటే మననాయకులకు రాస్ట్రం కంటే స్వలాభానికే మొగ్గుచూపుతారు.

                    మేధావులు ఒకసారి ఆలోచించండి.ఆంధ్ర,తెలంగాణాల కాకుండా నీటి వనరుల ఆధారంగా విభజిస్తె ఇరు ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుంది.లెకపొతె స్పస్టమైన విధానాలతో నీటి సమస్యను తీర్చి విభజిస్తె రెండు రాస్ట్రాల ప్రజలు సంతోషంగా వుంటారు.లేకపోతే ప్రతి ఎన్నికలప్పుడు ఇది నినాదం అవుతుంది.
అఖిల పక్షం పేరుతో రాజకీయ నాయకులు రాజకియాలే చేస్తారు.అంతందెకు కె.సి.ర్ కూడ సెప్టంబర్ 17 ను రాజకీయానికి వాడుకుంటున్నాదు.కొన్ని వేల మంది రజాకర్ల చేతిలో ప్రాణాలు అర్పిస్తే విమోచన దినం కాకుండా విలీన దినం ఏలా అవుతుందో ,దానిని మేధావులు ఏలా సమర్దిస్తారో వారి విచక్షణ కే వదిలివేయాలి. కె.సి.ర్ ధైర్యంగా విమోచనదినం అని చెప్పగలరా.. కావునా ఏవరి పరిధి లో వారు రాజకియాలు చేస్తారు అందులో తప్పులేదు.
    కాని మనరాస్ట్రంలో మేధావుల రాజకీయాలు చెయ్యడం మొదలు పెట్టారు.ఎంత దారుణమటే విశ్వవిద్యాలయాలలో విద్యార్ది సంఘాలు పోయి,కుల సంఘాలు పుట్టుకొచ్చాయి అంటే రాజకీయం ఏలా చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.చదువుకున్న మేధవులు కులాలను రూపుమాపాల్సింది పోయి కులసంఘలను ప్రొత్సహింస్తంటే వారి నీచ రాజకియాలను అర్ధం చెసుకోవచ్చు

No comments:

Post a Comment