Sunday, December 16, 2012

ఎవరు గొప్ప


నేను ఒక చదువుకున్న పౌరుడిని....
1)నేను ఒక గ్రాడ్యుయేట్ ని
2)ఉదయమే పేపరు చదువుతాను
3)సమాజం గురించి ఆలోచిస్తాను. దేశం ఏం అవుతుందో భయపడతాను
4)నేను మా కులం లో పుట్టినందుకు గర్వపడతాను.కుల సంఘంలో సభ్యుడిని అవుతాను.
5)కులానికి చెందిన గొప్పవాళ్ళను ఆదర్శంగా తీసుకుంటాను.మా కులం వాళ్ళకి చెందిన పేపర్లు మాత్రమే చదువుతాను
6)పోటీ పరిక్షలన్నీ వ్రాస్తాను .ఫలితం మాత్రం దేవుడుమీద వేస్తాను
7)ఇంగ్లీష్ మాట్లాడినాకూడ గ్రామర్ రాదు.తెలుగు గ్రామర్ రాదు,మ్యాథ్స్ లో మార్క్స్ వచ్హినా వడ్డి లెక్కలు,బ్యాంక్ లెక్కలు రావు.సోషల్ లో మార్క్స్ వుండి కూడ పరిపాలన మీద ,ఆర్దికస్తితి మీద అవగాహన వుండదు.చిన్న చిన్న వ్యాధులు మీద అవగాహన వుండదు.అయినా ఉద్యోగం రాలేదని ప్రభుత్వాన్ని నిందిస్తాను.
8)టెక్నాలజిని వాడతాను ,రెస్టారెంట్లకు వెళతాను ,ఎంజాయమెంట్ చేస్తాను.
9)చివరకు ప్రెవేటులొ గుమస్తాగ చేరాను.(ఆఫీసర్,మేనేజర్ పేరు ఏదైన కంపెనీల ద్రుష్టిలో గుమస్తానే )
10)ప్రభుత్వాలు కూడ లక్షల ఉద్యొగాలంటూ ప్రెవేటు కంపెనీలను ప్రోత్సాహిస్తుంది.         
నేను ఒక చదువుబ్బని పౌరిడిని..
1)ఉదయమే5గంటలకు లేస్తాను
2)నేను పేపరు చదవను.రాజకీయాలు గురించి ప్రతిరోజు ఆలోచించను
3)పొద్దిన్నే సద్దిన్నం తిని పొలానికి వెళతాను.ప్రక్రుతిని నమ్ముతాను.
4)కులం గురించి తెలుసు కాని వాటి గురించి ఆలోచించను.
5)వడ్డిలెక్కలు గురించి తెలుసు,చిన్నవ్యాధులకు భయపడను,ఖర్చు గురించి తెలుసు.
6)ప్రభుత్వ పధకాల గురించి అవగాహనవుంది 
7)సాయంత్రం మనసార నవ్వుకోవడానికి టీవి చూస్తాను సినిమాలకు అప్పుడప్పుడు వెళతాను.
8)ప్రతి పండగను సంతోషంగా జరుపుకుంటాను.ప్రతి పిండివంటను ఇంటిదగ్గర చేసుకొని తింటాము.
9)నేను పండిచిన వరి,కూరగాయలు,నిత్యవసరాల సరుకులను భారతదేశంతటా సరఫరాచేస్తాను.
10)నాకు నేనే బాస్ ,పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ప్రతినిధులు మాదగ్గర నిలబడతారు.
   
      ఇప్పుడు చెప్పండి కేవలం 30% మాత్రమే భారతదేశాన్ని పొషిస్తుంది.దీని అర్థం చదువుకోవద్దు అనికాదు చదువుకున్న యువత ఉద్దేశం మారాలి .ఉద్యోగం గురించిమాత్రమే కాకుండా దేశవనరులను,యువతను ఉపయొగించికొని భవిష్యత్తులొ ఆహరపు కొరతను తగ్గించటమే మన ప్రధమకర్థవ్యం.




మీ రైతు బజార్




     మీ ఇంటిదగ్గర ఉన్నఖాళీ స్తలాన్ని లీజుకు తీసుకోండి.మూడు,నాలుగు రకాల   కూరగాయల విత్తనాలు కొని చల్లండి.అఫీసుకు వెళ్ళెముందు,వచ్చిన తర్వాత నీళ్ళుచల్లండి . అప్పుడప్పుడు ఎరువులువేయండి.తీగలాగ చుట్టి అల్లుకునేటట్టూ చేయండి.మీరు పండిచే 10-12 కిలొలతో ఒక చిన్నపాటి రైతుబజార్ ను ఏర్పాటు చేయవచ్చు. దీనివలన మంచి కూరగాయలతో పాటు నీరు భూమిలొకి ఇంకటం వలన భూమి వేడిక్కెకుండా మీ వంతు కర్తవ్యం చేసినట్టు వుంటుంది...
                

పాల ఉత్పత్తిలొ ప్రధమస్తానం



స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యంత వేగంగా అభివ్రుద్ది చెందిన పరిశ్రమలలో పాల పరిశ్రమ ఒకటి.50%గేదలు,ఆవులు నుండి 20%గొర్రెలు,మేకలు నుండి ఉత్పత్తి అవుతుంది.
      2005-2006 అంచనా ప్రకారం మొత్తం నిల్వలలో  రోజుకు 229 గ్రాములు చొప్పున 90 మిలియన్లు ఉత్పత్తి చేసింది. 1993-2005 కాలంలో రికార్డ్ స్తాయిలో సంవత్సరానికి 4% చొప్పున వ్రుద్ది రేటు సాధించింది.నిర్వాహక సంస్తలలు అముల్(జిసిడిఎమ్మెఫ్)విజయ(.పి) సరస్(రాజస్తాన్) నందిని(కర్నాటక) గోకుల్(కొళహాపుర్) ద్వార ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది.
        అధిక ఉత్పత్తి ఉత్తరప్రదేశ్,పంజాబ్, రాజస్తాన్,హర్యాన,గుజరాత్ ఆంధ్రప్రదేశ్    ,కర్నాటక,తమిళనాడు నుండి వస్తుంది.పాల విప్లవం అనగానే గుర్తుకు వచ్చేది వర్గీస్ కురియన్ .నేషనల్ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ (ఎనడిడిబి) గా బాద్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశానికి గుర్తింపు వచ్చింది అనుటలో అతిశయొక్తి లేదు.